: పోప్ కార్యక్రమానికి కురియన్ హాజరవుతుండడంపై విమర్శలు
కొత్త పోప్ గా ఎన్నికైన మారియో బెర్గాగ్లియో బాధ్యతల స్వీకరణోత్సవానికి మంగళవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజె కురియన్ హాజరవుతుండడం విమర్శలకు దారి తీస్తోంది. కేరళ బాలికపై అత్యాచారం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కురియన్ పై ఇప్పటికే ప్రతిపక్షాలతో బాటు పలు మహిళా సంఘాలు విరుచుకుపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయనను పోప్ కార్యక్రమానికి పంపాలన్న కాంగ్రెస్ నిర్ణయం వివాదాస్పదమైంది. గతంలోనే ఈ కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు కురియన్ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకున్నారని కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ ఆరోపించారు. ఇప్పుడు పోప్ నుంచి క్షమాభిక్ష తెచ్చుకునేందుకే ఆయనను కాంగ్రెస్ పంపిస్తోందని వ్యాఖ్యానించారు.
1996లో కేరళ లోని సూర్యనెల్లిలో 16 సంవత్సరాల బాలికపై 40 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో కురియన్ కూడా ఉన్నారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సిందేనంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్ వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయనను పోప్ కార్యక్రమానికి పంపాలన్న కాంగ్రెస్ నిర్ణయం వివాదాస్పదమైంది. గతంలోనే ఈ కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు కురియన్ రా