: బయటపడిన 250 కేజీల బాంబు!
రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబు ఒకటి పశ్చిమ జర్మనీలో బయటపడింది. 45 అంతస్థుల భవనం కట్టేందుకు తవ్వకాలు జరుపుతుండగా.. దాదాపు 250 కేజీల బరువున్న బాంబు బయటపడింది. అప్పటికే చాలా వరకు తవ్వకాలు జరపడంతో బాంబును పేల్చేయడమే మంచిదని నిపుణులు నిర్ణయించారు. దీంతో అక్కడికి 300 మీటర్ల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న 5 వేల మంది ప్రజలను ఖాళీ చేయించారు.
గతంలో కూడా ఇలాంటిదే ఒక బాంబు ఇదే ప్రదేశంలో దొరికితే దానిని పేల్చేసేందుకు 1800 మందిని ఖాళీ చేయించారు. జర్మనీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి బాంబులు రెండో ప్రపంచ యుద్ధం కాలంలో కప్పిపెట్టారు. అవి అప్పుడప్పుడు బయటపడి ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నాయి.