: అన్నింటికన్నా కొడుకుతో ఆడుకోవడమే ఆనందాన్నిస్తోంది: శిల్పాశెట్టి
రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్ లో రాణించిన నటి శిల్పాశెట్టి.. తన సినీ ప్రస్థానంలో పలు పాత్రలు పోషించింది. ఇప్పుడు శిల్పాశెట్టి ఏడాదిన్నర వయస్సున్న తన కొడుకు వియాన్ తో గడుపుతుంటే.. సమయమే తెలియటం లేదని అంటోంది. ప్రస్తుతం ఓ టీవీ ఛానల్లో దర్శకుడు సాజిద్ ఖాన్, కొరియోగ్రాఫర్ లూయిస్ తో కలిసి ‘నచ్ బలియే 6’ రియాల్టీ షోకు హోస్ట్ గా శిల్పాశెట్టి వ్యవహరిస్తోంది. షూటింగ్ లో ఉన్నా తనకెప్పుడూ కొడుకు వియాన్ ధ్యాసే ఉంటోందని ఆమె చెబుతోంది.
2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన తర్వాత శిల్పాశెట్టి చేస్తున్న ఈ రియాల్టీ షో ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు తనకు వియన్ తో చేతి నిండా పని ఉంటోందని, ఈ షో పూర్తయ్యాక ఇక వాడికే సమయం మొత్తం కేటాయిస్తానని అంటోంది. మరి, శిల్పాశెట్టికి ఆల్ ది బెస్ట్ చెబుదామా!