: రెబల్స్ నిర్ణయంపై సాయంత్రం వరకు చూస్తాం: దిగ్విజయ్ సింగ్
రాజ్యసభ రెబల్ అభ్యర్థుల నిర్ణయం కోసం మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి చూస్తామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును చెత్త బుట్టలో పడెయ్యాలనేది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయం అని అన్నారు. ఇప్పట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుంచి తొలగించడం జరగదని డిగ్గీ రాజా తెలిపారు. నేటి సాయంత్రం పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆయనతో భేటీ కానున్నారు.