: తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటే సుప్రీంను ఆశ్రయిస్తాం: కేటీఆర్
విభజన బిల్లును తిరస్కరిస్తూ చేసిన తీర్మానం సాకుగా చూపి తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటే సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మంత్రుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ తీర్మానంగా సభలో ప్రవేశపెట్టారని అన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి నిబంధనలకు విరుద్ధంగా బిల్లు తిరస్కరణ తీర్మానాన్ని పెట్టారన్న ఆయన స్పీకర్ పై సీఎం రాజకీయ ఒత్తిడి తెచ్చినందుకు ఆయనలా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.