: బిల్లు పార్లమెంటులో పాసవుతుంది: షిండే
శాసనసభలో ముసాయిదా బిల్లు తీర్మానం వల్ల ఎలాంటి న్యాయ సమస్యలు రావని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని, బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ రంగంపై అధ్యయనం చేస్తున్నానని షిండే తెలిపారు.