: ముందు మగవారు మారాలి: అమీర్ ఖాన్
మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడాలంటే ముందు మగవారిలో మార్పు రావాలని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. గృహహింస ఆమోదనీయం కాదన్నారు. మహిళలకు మద్దతుగా నిలబడాలని, పురుషత్వాన్ని ప్రదర్శించరాదని అభిప్రాయపడ్డారు. పురుష అహంకారాన్ని పిరికితనంగా అభివర్ణించారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అమీర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.