: సైకిల్ పై తిరుగుతున్న నరేంద్రుడు!
అరే.. నరేంద్రమోడీ భయ్యా సైకిల్ పై వచ్చారే!.. సంభ్రమాశ్చర్యంతో అందరూ ఆయన చుట్టూ మూగుతున్నారు. అప్పుడు ఆయన అసలు విషయాన్ని వారికి చెప్పి, మీ అమూల్యమైన ఓటును బీజేపీకి వేసి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేయాలని కోరుతున్నారు. ఇంతకీ ఆ సైకిల్ పై వచ్చిందెవరు? నరేంద్ర పట్నాయక్. ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ ఆయన స్వస్థలం. మోడీ వీరాభిమాని. అచ్చం మోడీలానే ఉంటాడు మరి! అందుకే సైకిలెక్కి మోడీకి అనుకూలంగా ప్రచార యాత్ర చేస్తున్నాడు. ఇలా దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నాడు.