: సీఎం కిరణ్ నియంతలా వ్యవహరించారు: చీఫ్ విప్ గండ్ర
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం కిరణ్ నియంతలాగా వ్యవహరించారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందుతుందని విశ్వాసముందని ఆయన చెప్పారు. సాధారణ ఎన్నికలు తెలంగాణలోనే జరుగుతాయని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయాలను మాత్రమే చెప్పాలి తప్ప, తిరస్కరించాలనుకోవడం సరికాదని గండ్ర అభిప్రాయపడ్డారు.