: లాలూ వాంగ్మూలాన్ని ఇవ్వమన్న సీబీఐ కోర్టు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వాంగ్మూలాన్ని రికార్డు చేయమని బీహార్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 1990లో లాలూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రెజరీ నుంచి విడుదల చేసిన రూ.84.53 కోట్లకు సంబంధించి ఆరోపణలు రావడంతో అప్పట్లో ఆర్ సి 64 ఏ/96 కింద కేసు నమోదైంది. వాటికి సంబంధించే కోర్టు ఆయన వాంగ్మూలాన్ని అడిగింది. దాణా స్కాంలో నిందితుడిగా రుజువైన లాలూకు కోర్టు శిక్ష విధించడంతో గతేడాది చివరల్లో బెయిల్ పై విడుదలయ్యారు.