: శ్రీలంక ఆగడాలపై గళమెత్తిన తమిళనాడు విద్యార్ధులు
శ్రీలంక ఆగడాలపై తమిళనాడు విద్యార్ధులు గళమెత్తారు. లంక తమిళులపై ఆ దేశం ప్రదర్శిస్తున్న తీరుకు వ్యతిరేకంగా చెన్నైలో వందల మంది విద్యార్ధులు ఈరోజు ర్యాలీ నిర్వహించారు. జెనీవాలో జరగనున్న ఐక్య రాజ్యసమితి సమావేశాల్లో భాగంగా మానవ హక్కుల కమిషన్ లో శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదిస్తున్న తీర్మానానికి భారత్ ఓటు వేయాలని డిమాండు చేశారు. తీర్మానంలో కొన్ని సవరణలు చేయాలని కూడా కోరాలన్నారు.
ఈ సందర్భం గా వారు రాజ్ భవన్ ముట్టడించేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా, ఈ విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత నేడు కేంద్రానికి లేఖ రాశారు.
ఈ సందర్భం గా వారు రాజ్ భవన్ ముట్టడించేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసు