: డివైడర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ గరుడ బస్సు .. గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద ఆర్టీసీ గరుడ బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సు ఆయిల్ ట్యాంకర్ ధ్వంసమైంది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.