: చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింటాకు ఊరట


చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో స్టేట్ మెంట్ రికార్డు కోసం హాజరవ్వడంలో విఫలమైన ప్రీతి జింటాకు అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జనవరి 27వ తేదీన జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంట్ ను కొట్టివేసింది. సినీ రచయిత అబ్బాస్ టైర్ వాలా దాఖలు చేసిన కేసులో పలు దఫాలు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు వారెంట్లు జారీ చేసింది. వారెంట్ల జారీని సవాలు చేస్తూ ప్రీతి జింటా హైకోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News