: బిల్లు ఆగాలని కోరుకుంటున్నా: బొత్స
సీమాంధ్ర నేతగా రాష్ట్ర విభజన బిల్లు ఆగాలని కోరుకుంటున్నానని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నేతలు కోరుకుంటున్నట్టు బిల్లుపై చర్చ పూర్తయిందన్నారు. రాష్ట్ర విభజన బిల్లు విషయంలో ఒకరు గెలిచారు, మరొకరు ఓడారని భావించకూడదని బొత్స సూచించారు.