: శుక్రవారం నాడు నెల్లూరు జిల్లాలో జగన్ సమైక్యశంఖారావం
రేపు (శుక్రవారం) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో జిల్లాలో సమైక్యశంఖారావం యాత్రలో జగన్ పాల్గొంటారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం పది గంటలకు నాయుడుపేట బహిరంగ సభలో జగన్ పాల్గొంటారని ఆయన తెలిపారు. సాయంత్రం 3 గంటలకు మనుబోలు సభలో, 6 గంటలకు గూడూరులో జరిగే బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారని మేకపాటి చెప్పారు.