: 294 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయగలదు: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో పోటీ చేయగలిగే ఏకైక పార్టీ టీడీపీయేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు ఒక్కో ప్రాంతానికే పరిమితమైన పార్టీలన్నారు. దాంతో, 'టీడీపీతోనే ప్రజలకు భద్రత, భవిష్యత్తు' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. అయితే, ఒక ప్రాంతంలో కళ్లు, మరో ప్రాంతంలో కాళ్లు నరుక్కున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.