జర్మనీ యాత్రికురాలి అత్యాచారం కేసు నిందితుడు బిట్టీ మహంతిని, పలు ఆధారాలు సేకరించేందుకు కేరళ పోలీసు బృందం రాజస్థాన్ కు తీసుకొచ్చింది. కేసును పరిశోదిస్తున్న ప్రత్యేక దర్యాప్తుబృందం అధికారి ఎస్పీ ఎస్. కె సుదర్శన్ ఈ సందర్భంగామాట్లాడుతూ.. బిట్టీపై మోసం, ఫోర్జరీ ఆరోపణలతో కేసును నమోదుచేశామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అతని గురించి పలు విషయాలు సేకరించామన్నారు. రాజస్థాన్ జైలు నుంచిబిట్టీ వేలిముద్రలు, గుర్తింపు మార్కులు కూడా తీసుకున్నామని చెప్పారు. అయితే డీఎన్ఏ పరీక్ష అవసరం లేకుండానే అతనిని బిట్టీగా పోలీసులు గుర్తిం చారన్నారు. ఒకవేళ గుర్తింపు మార్కులు అవసరమైతే తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యవహారంలో
ఇప్పటికే మూడు పోలీసు బృందాలు సేకరించిన ఆధారాల ప్రకారం త్వరలో న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేస్తామని అధికారి వెల్లడించారు.