: 14 భారతీయ భాషల్లో 'బాపు గీతిక'
మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం 'బాపు గీతిక' పేరుతో పాటల ఆల్బమ్ ను విడుదల చేశారు. భారతదేశంలోని 14 భాషల్లో 108 పాటలతో ఈ ఆల్బమ్ ను రూపొందించామని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి కల్పనా ఫాల్కీవాలా తెలిపారు. గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఆల్బమ్ కోసం కృషి చేస్తున్నట్టు ఆమె చెప్పారు.