: ఆ విషయంలో మనకన్నా నేపాల్ మెరుగట!


ఉపఖండంలో భారత్ పెద్దన్న అయితే, పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ లాంటి చిరుదేశాలు చిన్న తమ్ముళ్ల వంటివి. కానీ, ఓ విషయంలో మాత్రం ఈ రెండూ పెద్దన్ననే తలదన్నుతున్నాయి. పేదరికాన్ని రూపుమాపడంలో నేపాల్, బంగ్లాదేశ్.. భారత్ కంటే మెరుగైన వృద్ధి రేటు కనబరుస్తూ పురోగామి పథంలో దూసుకెళుతున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది.

1999-2006 మధ్య కాలంలో భారత్ కూడా దారిద్ర్యాన్ని అధిగమించే విషయంలో అభివృద్ధి కనబర్చినా.. నేపాల్, బంగ్లాలు సాధించిన పురోగతిలో అది కేవలం మూడో వంతు మాత్రమేనట. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం నివేదికలను పరిశీలించిన మీదట ఆక్స్ ఫర్డ్ అధ్యయనవేత్తలు ఈ సంగతి చెప్పారు. ఆ సమయంలో భారత్ లో పేదరిక నిర్మూలన రేటు 1.2 శాతం నమోదు కాగా.. నేపాల్ 4.1 శాతం, బంగ్లాదేశ్ 3.2 శాతం అభివృద్ధి రేటు కనబర్చాయని ఆక్స్ ఫర్డ్ నివేదిక తెలుపుతోంది.

ఈ రెండు చిన్న దేశాల్లో ఆదాయ వనరులు తక్కువగా ఉన్నా.. సామాజిక పెట్టుబడుల విధానాన్ని పౌరసమాజంతో అనుసంధానం చేయడంలో సాఫల్యతే.. మెరుగైన పురోభివృద్ధి రేటు సాధనలో తోడ్పడిందని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News