: గ్యాస్ తో ఆధార్ లింకును తొలగించిన కేంద్రం
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఈ రోజు కేంద్ర కేబినేట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న... ఆధార్ తో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల లింకును తొలగిస్తున్నట్టు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. అంతే కాకుండా, బ్యాంకు ఖాతాకు గ్యాస్ సిలిండర్లకు మధ్య ఉన్న అనుసంధానాన్ని కూడా తొలగించారు. అయితే ఈ నిర్ణయాలు తాత్కాలికమే అని ప్రకటించారు.