: పార్లమెంటు ఆమోదించేదే తుది బిల్లు: కేసీఆర్
రాష్ట్రానికి ఒరిజినల్ బిల్లు కాకుండా ముసాయిదా బిల్లు వచ్చిందన్న కామెంట్లపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. బిల్లులో డూప్లికేటు, ఒరిజినల్ అనే తేడాలు ఉంటాయా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చిన బిల్లుకు అంత ప్రాధాన్యం ఉండదని... పార్లమెంటు ఆమోదించేదే తుది బిల్లు అని... ఉత్తరాంచల్ ఏర్పాటు ఈ విషయాన్నే చెబుతోందని స్పష్టం చేశారు. విభజన బిల్లు పార్లమెంటుకు వెళ్లిన తర్వాత కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొంది తీరుతుందని అన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే తేదీలు కూడా తనకు తెలుసని వెల్లడించారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని... పెరిగిన నియోజకవర్గాలు 2019లో అమల్లోకి వస్తాయని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతామని తనకు ఇప్పటికే సమాచారం అందిందని అన్నారు.