: మీడియాను టార్గెట్ చేసిన కేసీఆర్
ఎప్పుడూ ఇతర పార్టీలపై విరుచుకుపడే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు మీడియాపై సెటైర్లు విసిరారు. ఈ రోజు తెలంగాణ భవన్లో మాట్లాడుతూ, ప్రస్తుత మీడియా జర్నలిజం విలువలను కాలరాస్తోందని విమర్శించారు. ఏమాత్రం సంయమనం పాటించడం లేదని ఆరోపించారు. మీడియా ప్రతినిధులు చిల్లరగా ప్రవర్తిస్తున్నారని... ఇష్టమొచ్చిన రాతలతో తెలంగాణను ఆపలేరని కేసీఆర్ అన్నారు. ప్రస్తుత మీడియాలో న్యూస్ కన్నా వ్యూస్ ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు.