: తెలంగాణ ఏర్పాటు ఖాయం: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని, కుట్రలతో తెలంగాణ ఆగదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ (గురువారం) అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్ మనోహర్ సీమాంధ్ర నేతగానే వ్యవహరించారని ఆయన ఆరోపించారు. పార్లమెంటు అన్ని అంశాలను గమనిస్తోందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సీఎం మాటలకు విలువ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవమున్నా.. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.