: నేటి సాయంత్రం ఢిల్లీకి బొత్స
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రాజ్యసభ తిరుగుబాటు అభ్యర్థులపై అధిష్ఠానం పెద్దలతో చర్చించడానికే ఢిల్లీ పయనమవుతున్నట్టు సమాచారం. కాగా తెలంగాణ బిల్లు శాసనసభ నుంచి రాష్ట్రపతికి వెళ్లనున్న నేపథ్యంలో ఇంకేదయినా లోగుట్టు ఉందా? అని కూడా పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.