: ఈ తూటా.. దూసుకెళ్తే.. ఇక అంతే!
ఇదో వెరైటీ తూటా.. ఇది ఒక్కటి వాడితే, ఇంకో బుల్లెట్ వాడాల్సిన అవసరం లేదని దీన్ని తయారు చేసిన జీ2 రీసెర్చ్ అనే అమెరికన్ కంపెనీ చెపుతోంది. బయటకు మామూలు బుల్లెట్ లానే కనిపిస్తున్నా.. దీన్ని పేల్చితే, శరీరంలోకి దూసుకుపోయిన తర్వాత విచ్చుకుని.. చుట్టుపక్కల వున్న కీలక అవయవాల వైపు వెళుతుంది. తద్వారా వాటిని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా, అమెరికాలో ఒంటరిగా నివసిస్తున్న మహిళలు తమను తాము రక్షించుకోవడానికి దీన్ని తయారుచేశామని కంపెనీ తెలిపింది. గతంలో ఆగంతుకులపై రెండు మూడు రౌండ్లు కాల్పులు జరిపినా.. వారు తమ వెంటపడిన సందర్భాలున్నాయని పలువురు భాదితులు చెప్పటంతో దీన్ని తయారుచేశామని జీ2 రీసెర్చ్ చెబుతోంది. ఈ తూటాలను ఇటీవల లాస్ వెగాస్ లో జరిగిన షాట్ షోలో ప్రదర్శించారు.