: హాస్య చతురులకే నా గుండెలో చోటు: పరిణీతి
హాస్య చతురులకే తన హృదయంలో చోటు అని బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రకటించింది. 'నాకు హాస్యం చాలా ముఖ్యం. మంచి హస్య చతురతతో నాకు కాబోయేవాడు ఉండాలి. అంతే కానీ, అందంగా ఉన్నాడా? లేడా? అన్నది ప్రాధాన్యం కాదు. ఇక డబ్బులు విషయానికొస్తే నేను సంపాదించగలను' అంటూ తాను నటించిన 'హసీతో ఫాసీ' చిత్ర ప్రచారం సందర్భంగా పరిణీతి చోప్రా ముంబైలో విలేకరులకు తెలిపింది. శరీర బరువుపై మాట్లాడుతూ.. బరువు తగ్గించుకోవడమే తన ప్రాధాన్యం అని చెప్పింది. సోనాక్షిసిన్హా అధిక బరువుందని తాను అనుకోనని.. ఆమె చాలా అందంగా ఉంటుందని కితాబు ఇచ్చింది.