: అందరూ అభిప్రాయం చెప్పారు: పొన్నాల


శాసనసభ్యులంతా బిల్లుపై చర్చలో పాల్గొన్నారని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ స్పష్టం చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. స్పీకర్ కు మౌఖికంగా లేక లిఖితపూర్వకంగా నేతలంతా అభిప్రాయాలు వెల్లడించారని అన్నారు. కేంద్ర మంత్రి వర్గం చర్చ సారం గ్రహించి సవరణలతో పార్లమెంటులో పెడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. చర్చలో పాల్గొన్న శాసనసభ్యులందర్నీ అభినందిస్తున్నానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News