: అది కొండచిలువల కొంప!


కాలిఫోర్నియా నగరంలోని ఒక ప్రాంతం. ఐదు పడకగదుల ఇల్లు. అది బుచ్ మన్(53) అనే ఒక టీచర్ ఉండే నివాసం. కొన్ని రోజులుగా తీవ్ర దుర్వాసనతో ఆ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమాచారం పోలీసులకు చేరింది. వారు రంగంలోకి దిగారు. ఆ టీచర్ ఇంట్లోకి వెళ్లి చూడగా కొండచిలువలు దర్శనమిచ్చాయి. నాలుగు పడకగదుల నిండా కొండచిలువలే. 400 వరకు ఉన్నాయి. కొన్ని బతికినవి.. మిగతావి చచ్చినవి. ప్యాకెట్లలో ప్యాక్ చేసి.. డబ్బాల్లో పెట్టి ఇంటినిండా అమర్చి ఉన్నాయి. పోలీసులు సైతం ఆ ఇంట్లోకి అడుగుపెట్టలేనంత స్థాయిలో దుర్గంధం అక్కడ నెలకొంది. గదుల్లో చచ్చిన ఎలుకలు కూడా పడి ఉన్నాయి. పోలీసులు టీచర్ ను అరెస్ట్ చేశారు. అతడు పాముల పెంపక వ్యాపారంలో ఉన్నట్లు గుర్తించారు.

  • Loading...

More Telugu News