: తెలంగాణ ఏర్పాటే మిగిలింది: జానారెడ్డి


శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తి కావడం సంతోషంగా ఉందని మంత్రి జానారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చర్చ ముగిసింది కనుక, ఇక మిగిలింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటేనని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసుపై తీర్మానం రాజ్యంగ విరుద్ధమని తెలిపిన ఆయన, సీఎం తీర్మానం సీమాంధ్ర నేతలకు కంటితుడుపు చర్య అని అభివర్ణించారు.

తాము ఎప్పటికప్పుడు ఆర్టికల్-3 ప్రకారం పంపిన బిల్లుపై శాసనసభ అభిప్రాయాలను పంపుతున్నామని స్పీకర్ పేర్కొన్నారని ఆయన తెలిపారు. బిల్లుపై రాష్టపతి అడిగిన విధంగా శాసనసభ అభిప్రాయాలు పంపుతున్నామని ఆయన అన్నారు. తీర్మానం నాలుగు గోడల మధ్య ఉండేదని, బిల్లుకు దానికి సంబంధం లేదని ఆయన అన్నారు. రాష్ట్రపతి అడిగింది అభిప్రాయాలేనని, వాటినే పంపుతున్నామనీ స్పీకర్ కూడా తెలిపారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News