: ఇది సంక్షేమ బడ్జెట్ : ఆనం
ఇది సంక్షేమ బడ్జెట్ అని ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. శాసనసభ వాయిదా అనంతరం ఆయన శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. కొత్త చట్టానికి అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు.
బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ ఉప్రపణాళికకు రూ. 22.8 శాతం నిధులు ఉండేలా చూశామని మంత్రి చెప్పారు, మైనార్టీ సంక్షేమానికి గతేడాదితో పోల్చితే 110శాతం అధికంగా నిధులు కేటాయించామని వెల్లడించారు. బీసీ సంక్షేమనికి గతేడాదికంటే, 33 శాతం అధిక నిధులు కేటాయించటమే ఇది సంక్షేమ బడ్జెట్ అనేందుకు తార్కాణమని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.