: సి.రామచంద్రయ్య తీర్మానానికి మండలి ఆమోదం


శాసనమండలిలో రాష్ట్రమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ప్రవేశపెట్టిన నోటీస్ పై ఓటింగ్ జరిగింది. రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరిస్తూ రామచంద్రయ్య మండలికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈ రోజు ఛైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం మూజువాణి ఓటింగ్ తో మండలి ఆమోదం పొందింది. దీంతో రాష్ట్ర శాసనసభతో పాటు, శాసనమండలిలో కూడా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు తిరస్కారానికి గురయింది.

  • Loading...

More Telugu News