: సీఎం సిక్సర్ కొట్టాడు.. సువర్ణాక్షరాలతో లిఖిందగిన రోజిది: ఆనం వివేకా
ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతికి సిక్సర్ కొట్టారని అన్నారు. బంతి స్టేడియం బయట పడిందని చెప్పారు. తెలుగు ప్రజల ఐక్యతను ముఖ్యమంత్రి, స్పీకర్ లు కాపాడారని కొనియాడారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి తన బాధ్యత నిర్వర్తించారని ఆయన అన్నారు.