: రాష్ట్రపతి ముందున్న రెండు ఆప్షన్లు
రాష్ట్ర పునర్విభజన బిల్లుకు సంబంధించి శాసనసభ పాత్ర ముగియడంతో... ఇప్పుడు బంతి రాష్ట్రపతి కోర్టులోకి వెళ్లింది. అసెంబ్లీ తిరస్కరణకు గురైన బిల్లును రాష్ట్రపతి ఏం చేస్తారో అన్న ఉత్కంఠ ఇప్పుడు అందర్లోనూ మొదలైంది. రాష్ట్ర శాసనసభ నుంచి టీబిల్లు ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతికి చేరే అవకాశం ఉంది. విశ్లేషకుల అంచనా ప్రకారం... రాష్ట్రపతి ముందు ప్రస్తుతం రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది... అసెంబ్లీలో చర్చ పూర్తయిందంటూ, తదుపరి చర్యల కోసం కేంద్ర హోం శాఖకు బిల్లును పంపించడం. రెండోది... బిల్లును అసెంబ్లీ తిరస్కరించింది కనుక, దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో న్యాయ నిపుణుల సలహాలను కోరడం. ఈ రెండు ఆప్షన్లలో రాష్ట్రపతి ప్రణబ్ దేన్ని ఎంచుకుంటారో వేచిచూడాల్సిందే.