: కోర్టులో బాంబు కలకలం
హైదరాబాద్ జంట పేలుళ్ల అనంతరం రాష్ట్రంలో బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కోర్టుకూ ఈ బెదిరింపు తప్పలేదు. కోర్టులో బాంబు పెట్టినట్టు ఈరోజు ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఉన్నట్టుండి బాంబు కలకలం రేగడంతో న్యాయవాదులు కోర్టు వెలుపలకు పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.