: ఓటింగ్ కు, తీర్మానం ఆమోదం పొందడానికి సంబంధం లేదు: రావుల
ఓటింగ్ కు, మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందడానికి సంబంధం లేదని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి తెలిపారు. బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ సభలో ప్రకటించారు కాబట్టి... శాసనసభ పాత్ర అయిపోయిందని తాము భావిస్తున్నామని చెప్పారు. బిల్లు ఇక్కడ నుంచి రాష్ట్రపతికి, అక్కడ నుంచి పార్లమెంటుకు వెళుతుందని అన్నారు. పద్దతి ప్రకారం ఇక్కడ పని పూర్తయిందని... ఇక తెలంగాణ రావడమే మిగిలుందని చెప్పారు. సభలో బిల్లు గెలిచిందా, ఓడిందా? అనే విషయం తమకు అనవసరమని తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.