: ఇది తెలంగాణ ప్రజల విజయం: కోమటిరెడ్డి
విభజన బిల్లును ఓటింగ్ లేకుండానే కేంద్రానికి పంపడంలో తెలంగాణ నేతలు విజయం సాధించారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు జరిగిపోయిందని, ఢిల్లీకి బిల్లును పంపించడం ద్వారా అది సాధ్యమయిందని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. ఇక మిగిలింది కేవలం లాంఛనమేనని, మిగిలిన అంశాన్ని పార్లమెంటులో సోనియా గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.