: సీఎం డ్రామా ముగిసింది.. తెలంగాణ కల సాకారం కాబోతుంది: డిప్యూటీ సీఎం
ఇంతకాలం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆడిన డ్రామా ముగిసిందని, తెలంగాణ కల సాకారం కాబోతుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇక సీఎం వద్ద బ్యాటు, బాలు రెండూ లేవన్నారు. మైదానం ఖాళీ అయిందని, ఎలాంటి మైలేజీ రాలేదని వ్యాఖ్యానించారు. సీఎం స్వార్థం కోసమే ఇంతకాలం డ్రామా ఆడారని దామోదర ఆరోపించారు.