: బడ్జెట్ పై సభాహక్కుల నోటీస్ ఇచ్చిన జేపీ
మొట్ట మొదటిసారిగా కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ మీద విపక్షాలు పెదవివిరుస్తున్నాయి. దాదాపు అన్ని విపక్షాలూ దీనిపై ఆందోళనకు దిగాయి. ఏ నిబంధన కింద వ్యవసాయబడ్జెట్ ప్రవేశపెట్టారంటూ లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. అంతేకాదు, ఈ అంశంపై ఆయన శాసన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
దీనికి సమాధానంగా మంత్రి కన్నా వివరణ ఇస్తూ, వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక తొలిసారి అయినందున విపక్షాలకు కొంత అయోమయం ఏర్పడిందని తెలిపారు.
దీనికి సమాధానంగా మంత్రి కన్నా వివరణ ఇస్తూ, వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక తొలిసారి అయినందున విపక్షాలకు కొంత అయోమయం ఏర్పడిందని తెలిపారు.