: రాహుల్ నివాసం ఎదుట సివిల్స్ అభ్యర్థుల నిరసన


ఢిల్లీలో 12 తుగ్లక్ రోడ్డులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం ఎదుట సివిల్స్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. ఇంటిని ముట్టడించేందుకు అభ్యర్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సివిల్స్ పరీక్షలో గత ఏడాది చేసిన మార్పులను తొలగించాలని వారు డిమాండు చేస్తున్నారు. అలాగే సివిల్స్ అభ్యర్థులకు మరో మూడుసార్లు పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో నూతన విధానాన్ని యూపీఎస్ సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) గత ఏడాది అమలులోకి తీసుకువచ్చింది. దానిపై దేశవ్యాప్తంగా సివిల్స్ అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ అభ్యర్థులు నిన్నటి (బుధవారం) నుంచి రాహుల్ నివాసం ముందు ఆందోళన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News