: కరీంనగర్ డాక్టరుకి యువ పరిశోధకుడి అవార్డు
జాతీయ యువ పరిశోధకుడు అవార్డు-2014ను కరీంనగర్ జిల్లా మల్లారం గ్రామానికి చెందిన ప్రముఖ వెన్నెముక వైద్యుడు సి.హెచ్. సురేష్ కుమార్ కు లభించింది. ఈ అవార్డును 35 సంవత్సరాలలోపు వైద్యులకు ఇస్తారు. వైద్య రంగంలో శస్త్ర చికిత్సకు సంబంధించి విస్తృత పరిశోధన చేసిన వైద్యులకు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 27వ తేదీన కోల్ కతాలో నిర్వహించిన డాక్టర్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో డాక్టర్ సహజన్ చేతుల మీదుగా సురేష్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తిని తానేనని చెప్పారు. చిన్నారుల వెన్నెముక సమస్యలపై పరిశోధనకు గాను తనకు ఈ అవార్డు వచ్చిందని ఆయన చెప్పారు. సురేష్ కుమార్ ప్రస్తుతం హైదరాబాదులోని మెడిసిటి ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. 90 శాతం వెన్నెముక సమస్యలకు సరియైన రీతిలో కూర్చోకపోవడమే కారణమని, మిగిలిన 10 శాతం సమస్యలు ఇన్ ఫెక్షన్ కారణంగా వస్తాయని ఆయన చెప్పారు.