: డీఎంకేలో చీలికలు.. అళగిరి జన్మదిన వేడుకలకు హాజరైన ముగ్గురు ఎంపీలు
డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరిని పార్టీ నుంచి, పదవుల నుంచి కొన్నాళ్ల పాటు తొలగించడం డీఎంకేలో చీలికలకు దారితీస్తోంది. మరో నాలుగు నెలల్లో స్టాలిన్ చనిపోతాడంటూ అళగిరి చేసిన వ్యాఖ్యలను తట్టుకోలేకే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని కరుణ చెప్పడం తమిళనాడులోనే కాక, దేశ వ్యాప్త రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులోని మధురై ప్రాంతంలో మంచి పట్టున్న అళగిరి నేడు తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు హాజరవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అటు ఆ రాష్ట్రంలో అళగిరికి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టడం, అదినేతను ధిక్కరించి, సస్పెన్షన్ వేటు పడిన అళగిరితో సన్నిహితంగా ఉండటం పలు ఊహాగానాలకు ఊతమిస్తోంది. దాంతో, డీఎంకేలో చీలికలు ఏర్పడం ఖాయమని సమాచారం.