: త్వరలో హీరో మోటోకార్ప్ నుంచి డీజిల్ బైక్!


పెట్రోల్ కు టాటా చెప్పేసి.. చౌకగా డీజిల్ తో బైక్ పై రయ్ మంటూ దూసుకుపోయే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ? కానీ, మార్కెట్లో డీజిల్ బైకులు లేవు. అందుకే ఈ లోటును తీర్చే పనిలో హీరో మోటో కార్ప్ తలమునకలై ఉంది. 150సీసీ సామర్థ్యంగల ఈ డీజిల్ బైక్ కు సంబంధించిన నమూనాను నిన్న హీరో ఆవిష్కరించింది. దీనిపై తాము మరింతగా పరిశోధన చేయాల్సి ఉందని, ఇందుకు కొంత సమయం పడుతుందని కంపెనీ ఎండీ పవన్ ముంజాల్ ఢిల్లీలో తెలిపారు. ఇక హీరో నాలుగు కొత్త మోటారు సైకిళ్లను కూడా ఆవిష్కరించింది. హైబ్రిడ్ స్కూటర్ లీప్, 250 సీసీ స్పోర్ట్స్ బైక్ హెచ్ఎక్స్ఆర్ 250, 110సీసీ డాష్, 150సీసీ ఎక్స్ ట్రీమ్ స్పోర్ట్స్ ఉన్నాయి. పెట్రోల్, విద్యుత్ రెండింటితోనూ నడవడం లీప్ స్కూటర్ ప్రత్యేకత.

  • Loading...

More Telugu News