: టాటా టెలీ వొడాఫోన్ చేతికి వెళ్లనుందా?
మొబైల్ ఫోన్ సర్వీసుల రంగంలోకి ప్రవేశించి దశాబ్దం దాటినా నేటికీ లాభాలను రాబట్టుకోవడంలో విఫలమవుతున్న టాటా టెలీ.. ఆ వ్యాపారాన్నే వదిలించుకునే ఆలోచనలో ఉందా?. గత కొన్ని రోజులుగా జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను చూస్తే మొబైల్, టెలికాం సర్వీసుల నుంచి టాటా వైదొలగాలని తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టాటా డొకోమో, వీఎస్ఎన్ఎల్ లో వాటాలను వొడాఫోన్ కు విక్రయించే విషయమై ఆ రెండు కంపెనీల మధ్య చర్చలు నడుస్తున్నాయని ఒక బిజినెస్ పత్రిక పేర్కొంది. ప్రస్తుతం టాటా డొకోమోలో టాటాలకు 74 శాతం వాటా ఉండగా, 26 శాతం జపాన్ కు చెందిన డొకోమో వద్ద ఉంది. వీఎస్ఎన్ఎల్ లో ప్రభుత్వానికి 26 శాతం, టాటాలకు 74 శాతం వాటాలున్నాయి.