: శ్రీలంకపై తీర్మానం విషయంలో ప్రధానికి జయలలిత లేఖ
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ లో శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోరారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. అమెరికా ప్రతిపాదిస్తున్న తీర్మానాన్ని సమర్థించాలని కోరారు.
ఇదే విషయమై ఆమె కేంద్రానికి కొన్ని రోజుల క్రితం బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయకుంటే యూపీఏ సర్కారు నుంచి తప్పకుంటామని డీఎంకే అధినేత కరుణానిధి కూడా కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి విదితమే.