: 233 మంది ఆటగాళ్లతో ఐపీఎల్ తుది జాబితా
వన్డేల్లో అవకాశాల కోసం అర్రులు చాస్తున్న ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సెహ్వాగ్ లకు ఐపీఎల్-7లో మంచి ధర పలకనుంది. వీరిద్దరి కనీస ధర 2 కోట్లుగా ఐపీఎల్ నిర్ణయించింది. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ జాన్సన్ కు కూడా ఇదే కనీస ధరను ఖరారు చేసింది. 7వ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ వచ్చే నెల 12, 13వ తేదీలలో బెంగళూరులో జరగనుంది. ఇందుకోసం 233 మంది క్రికెటర్లతో ఐపీఎల్ జాబితాను విడుదల చేసింది. ఇందులో 31 మంది ఆటగాళ్లే ఎక్కువ కనీస ధరను దక్కించుకున్నారు. ఈ 31 మందిలో భారత క్రికెటర్లు దినేష్ కార్తీక్, ప్రాగ్యన్ ఓజా, యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, ప్రవీణ్ కుమార్, మురళీ విజయ్ ఉన్నారు. వీరి కనీస ధర 1.5కోట్లుగా ఉంది.