: నేడు ఒకే వేదిక పంచుకుంటున్న సోనియా, నితీశ్
పాట్నాలో ఏర్పాటు చేయబోతున్న అలిఘర్ ముస్లిం యూనివర్శిటీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఇదే కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా హాజరవుతారు. ఇలా వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో బీహార్, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దాంతో, ఈ కార్యక్రమానికి రెండు రోజుల ముందుగా నితీశ్ కు ఆహ్వానం అందింది. మండిపడుతున్న ఆయన, ఈ వ్యవహారం యూపీఏ సంస్కృతిని, స్వభావాన్ని తెలియజేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.