: హెలికాప్టర్లో ఖైదీలు ఎగిరిపోయారు


క్యుబెక్ లోని మాంట్రియల్ ప్రాంతం. ఆదివారం మధ్యాహ్న సమయం. రెక్కల చప్పుడుతో ఒక హెలికాప్టర్ జీరోమ్ జైలుపై ఎగురుతోంది. అందులోంచి ఓ తాడు కిందికి వేలాడింది. ఇద్దరు ఖైదీలు తాడును గట్టిగా పట్టుకున్నారు. హెలికాప్టర్ నెమ్మదిగా ముందుకు సాగిపోయింది. అప్పుడప్పుదు హాలీవుడ్ సినిమాలలో కనిపించే ఇలాంటి దృశ్యం వాస్తవిక ప్రపంచంలో ఆవిష్కృతమైంది. 

ఇది చూసి జైలు సిబ్బంది అవాక్కయ్యారు. నెమ్మదిగా తేరుకుని  పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. వారు వెంటనే వెతుకులాట మొదలెట్టారు. అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ కనిపించింది. పైలట్ ఒక్కడే అక్కడున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆనక తప్పించుకున్న ఆ ఇద్దరు ఖైదీలనూ పట్టేసుకున్నారు. 

  • Loading...

More Telugu News