: గూగుల్ మోటరోలో స్మార్ట్ ఫోన్లు ఇక లెనోవో సొంతం
గూగుల్ మోటరోలా స్మార్ట్ ఫోన్ల వ్యాపారం లెనోవో చేతికి వెళ్లనుంది. 290 కోట్ల డాలర్ల (సుమారు రూ.18వేల కోట్లు)కు స్మార్ట్ ఫోన్ల వ్యాపారాన్ని గూగుల్ విక్రయించనుంది. నిజానికి మోటరోలాను కొని గూగుల్ పెద్ద ఎత్తున నష్టపోయింది. 2012లో గూగుల్ మోటరోలా మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని 1,240కోట్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ తర్వాత దాని విలువ 200 కోట్ల డాలర్లు హరించుకుపోయింది. గతేడాది మోటారోలాకే చెందిన ఆపరేషన్ల విభాగాన్ని విక్రయించడం ద్వారా 235కోట్ల డాలర్లను గూగుల్ రికవరీ చేసుకుంది. ఇప్పుడిది రెండో డీల్. ఈ కొనుగోలు ద్వారా స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలో లెనోవో అంతర్జాతీయ పోటీదారుగా మారనుంది.