: మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ కు అవకాశం?
టీబిల్లుపై చర్చకు రాష్ట్రపతి విధించిన గడువు ఈ రోజు ముగియనుండటంతో... అన్ని పార్టీల నేతలు, ఇరు ప్రాంతాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. గడువు పొడిగించాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ కు సీఎం కిరణ్ లేఖ రాసిన నేపథ్యంలో, ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రణబ్ దాదా గడువును పెంచుతారా? లేదా? అన్న విషయం అందరి మదిని తొలచివేస్తోంది. గడువు పెంపు సమాచారం కోసం సీఎం, స్పీకర్ ఎదురుచూస్తున్నారు. అయితే, రాష్ట్రపతి గడువు పెంచే అవకాశాలను కొట్టిపారేయలేమని కొంతమంది రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే మాత్రం... ఈ మధ్యాహ్నం తర్వాత బిల్లుపై ఓటింగ్ నిర్వహించే అవకాశాలున్నట్టు విశ్వసనీయ సమాచారం.