: శాసనసభ ఆవరణలో సీమాంధ్ర టీడీపీ సభ్యుల ధర్నా
శాసనసభ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. శాసనసభలో ముసాయిదా బిల్లుపై ఓటింగ్ పెట్టడంతో పాటు, బిల్లును తిరస్కరిస్తూ సభలో తీర్మానం చేయాలని ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.